Deputy CM Pawan : బంగ్లాదేశ్ పరిస్థితులపై వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్
బంగ్లాదేశ్‌లో తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు...
Deputy CM Pawan : బంగ్లాదేశ్ పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్ నుండి ఇటీవల చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ప్రదీప్ భౌమిక్‌ను పగటి వెలుగులో క్రూరంగా హ్యాకింగ్ చేయడం నుంచి హిందూ దేవాలయాలను (ఇస్కాన్ & కాళీ మాత దేవాలయం) ధ్వంసం చేయడం వరకు మైనారిటీలను దారుణంగా చంపడం, హిందూ మైనారిటీలపై క్రైస్తవులు, బౌద్ధులపై హింసను లక్ష్యంగా చేసుకోవడం వరకు,అహ్మదీయులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. బంగ్లాదేశ్‌లో తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలను పునరుద్ధరించాలని తాను భారతదేశంలోని @unhumanrights @UN_HRC మరియు బంగ్లాదేశ్ హైకమిషన్‌ను కోరుతున్నానన్నారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, హిందువులందరికీ భద్రత, భద్రతతో పాటు స్థిరత్వం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ట్వీట్ చేశారు.
Deputy CM Pawan Tweet
కాగా.. బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. మైనారిటీలను వేధిస్తున్నవారిపై విచారణ వేగవంతానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో 10 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో నిరసన సందర్భంగా మూడు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.
మరోవైపు బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై హింసాత్మక దాడులు పెరగడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దాడులను ఖండిస్తూ లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. లండన్‌లోని పార్లమెంటు భవనం ఎదుట ఆందోళనకారులు బంగ్లాదేశ్ జెండా, చిహ్నంలతో నిరసన తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వివిధ మానవహక్కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద కూడా శనివారం ఆందోళన నిర్వహించారు. కాగా, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మొహమ్మద్ యూనస్ ఖండించారు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను కాపాడవలసిందిగా యువతను కోరారు.
Also Read : Baba Siddhnath Temple Stampede: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు మృతి !