Deputy CM Shinde : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేకు బాంబు బెదిరింపులు

Deputy CM Shinde : శంలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటివల ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లిన క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అవి మరువకముందే, తాజాగా మరొక బాంబు బెదిరింపు వెలుగులోకి వచ్చింది.

Deputy CM Shinde Got Bomb Threatning Calls

ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Deputy CM Shinde)కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన వాహనాన్ని పేల్చివేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోరేగావ్ పోలీస్ స్టేషన్, మంత్రాలయ, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ సహా అనేక ప్రాంతాలకు ఇమెయిల్ వచ్చింది. ఆ క్రమంలో, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వాహనంపై దాడి జరిగే ఛాన్స్ ఉన్నట్లు మెయిల్ మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also Read : AP CM-Deputy CM Meet : కేంద్ర మంత్రి పాటిల్ తో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కీలక భేటీ

Leave A Reply

Your Email Id will not be published!