Devdutt Padikkal : కోచ్ సంగ‌క్క‌ర సపోర్ట్ మ‌రిచి పోలేను

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట‌ర్ పడిక్క‌ల్

Devdutt Padikkal : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఊహించ‌ని రీతిలో ప్లే ఆఫ్స్ కు చేరువ‌లో ఉంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ కెప్టెన్సీ లో ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల‌లో గెలుపొంది 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై 16 పాయింట్లు సాధించింది.

పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ టాప్ లో ఉంటే రెండో స్థానంలో రాజ‌స్థాన్ నిలిచింది. ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఇక టోర్నీకి సంబంధించి అత్య‌ధిక ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అవార్డు రేసులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్

నెంబ‌ర్ 1లో ఉండ‌గా ఇక బౌల‌ర్ల‌కు ఇచ్చే ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఇదే జ‌ట్టుకు చెందిన యుజ్వేంద్ర చాహ‌ల్ టాప్ లో ఉన్నాడు.

మొత్తంగా శ్రీ‌లంక దిగ్గ‌జ మాజీ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్ గ‌త ఏడాది డైరెక్ట‌ర్ గా తీసుకుంది. ఇదే స‌మయంలో

స్టీవ్ స్మిత్ ను తొల‌గించి సంజూ శాంస‌న్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఈసారి ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో అద్భుత విజ‌యాలు న‌మోదు చేసింది రాజస్థాన్. ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఇప్ప‌టికే జ‌ట్టుకు చెందిన యువ ఆట‌గాళ్లు య‌శ‌స్వి జైశ్వాల్ , దేవ‌ద‌త్ ప‌డిక‌ల్(Devdutt Padikkal) , రియాన్ ప‌రాగ్ ఆడుతున్నారు.

త‌మ ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. బౌలింగ్ కోచ్ గా కూడా శ్రీ‌లంక‌కు చెందిన స్టార్ బౌల‌ర్ లసిత్ మ‌లింగ‌ను తీసుకుంది. దీంతో

అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాజస్థాన్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకునేలా ఉంటోంది.

ప‌లువురు ఆట‌గాళ్లు కుమార సంగ‌క్క‌ర స‌పోర్ట్ మ‌రిచి పోలేమంటూ కితాబు ఇస్తున్నారు. ఇక దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్(Devdutt Padikkal) అయితే

సార్ సూచ‌న‌లే త‌ను ఆడేందుకు కార‌ణ‌మ‌య్యాయంటూ ప్ర‌శంసించాడు. 13 మ్యాచ్ ల‌లో 334 ర‌న్స్ చేశాడు.

Also Read : ఆ జ‌ట్టు విజ‌యాల్లో అత‌డే కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!