Devon Conway : డేవాన్ కాన్వే మార‌థాన్ ఇన్నింగ్స్

ఢిల్లీకి చుక్క‌లు చూపించిన క్రికెట‌ర్ఢిల్లీకి చుక్క‌లు చూపించిన క్రికెట‌ర్

Devon Conway : ఐపీఎల్ లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ . లీగ్ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది.

మొద‌ట బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు చేసింది. ఇక టార్గెట్ ఛేద‌న‌లో మైదానంలోకి వ‌చ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ పూర్తిగా చేతులెత్తేసింది.

దీంతో 91 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్ . ఇక ముందుగా రంగంలోకి దిగిన సీఎస్కే ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగింది. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ఒకే ఒక్క‌డు డేవాన్ కాన్వే(Devon Conway).

ఢిల్లీ బౌల‌ర్ల‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ప్ర‌తి బంతిని బౌండ‌రీ లైన్ దాటించే ప్ర‌య‌త్నం చేశాడు కాన్వే. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో అల‌రించాడు. అత‌డికి రుతురాజ్ గైక్వాడ్ తోడు కావ‌డంతో ఇద్ద‌రూ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

ఇక డేవాన్ కాన్వే(Devon Conway) విష‌యానికి వ‌స్తే కేవ‌లం 49 బాల్స్ మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 87 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఈ మొత్తం ప‌రుగుల్లో కేవ‌లం ఫోర్లు, సిక్స‌ర్ల ద్వారా 72 ర‌న్స్ వ‌చ్చాయంటే అర్థం చేసుకోవ‌చ్చు డేవాన్ కాన్వే(Devon Conway)  ఎంత‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడోన‌ని. నిల‌క‌డైన ఆట తీరుతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు

కాన్వే. నువ్వా నేనా సాగుతుంద‌న్న లీగ్ మ్యాచ్ చివ‌ర‌కు పేల‌వంగా, ఏక‌ప‌క్షంగా సాగింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి దాకా ప్లే ఆఫ్స్ కు చేరు కోవాలంటే ఇక జ‌రిగే ప్ర‌తి మ్యాచ్ గెల‌వాల్సి ఉంటుంద చెన్నై సూప‌ర్ కింగ్స్ కు.

 

Also Read : చెల రేగిన చెన్నై త‌ల‌వంచిన ఢిల్లీ

Leave A Reply

Your Email Id will not be published!