Devon Conway : క‌దం తొక్కిన డెవాన్ కాన్వే

ఐపీఎల్ ఫైన‌ల్ లో సీఎస్కే గెలుపు

Devon Conway : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ 2023 లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది చెన్నై సూప‌ర్ కింగ్స్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 214 ర‌న్స్ చేసింది. అనంత‌రం మ్యాచ్ కు వ‌ర్షం ఆటంకిగా మారింది. దీంతో ఐపీఎల్ రూల్స్ ప్ర‌కారం డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అమ‌లు చేశారు అంపైర్లు.

దీంతో నిర్ణీత ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. మొత్తం 171 ర‌న్స్ టార్గెట్ గా నిర్ణ‌యించారు. చివ‌ర‌కు అర్ధ‌రాత్రి 12.10 గంట‌ల స‌మ‌యంలో సీఎస్కే బ్యాటింగ్ కు దిగింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. గెలుపు ఇరు జ‌ట్ల‌ను ఊరించింది. ఈ త‌రుణంలో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భారీ స్కోర్ చేయ‌డంలో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు డెవాన్ కాన్వే(Devon Conway). మ‌రోసారి స‌త్తా చాటాడు. కేవ‌లం 25 బంతులు ఎదుర్క‌ని 47 ర‌న్స్ చేశాడు.

ఇందులో 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. నిర్దేశించిన 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ పూర్తి చేసింది. ఇక శివ‌మ్ దూబే 21 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. గైక్వాడ్ 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 26 ర‌న్స్ చేశాడు. అజింక్యా ర‌హానే 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 27 ర‌న్స్ చేశాడు. అంబ‌టి రాయుడు ఒక ఫోర్ 2 సిక్స‌ర్ల‌తో 19 ప‌రుగులు చేస్తే ర‌వీంద్ర జ‌డేజా ఒక ఫోర్ ఒక సిక్స‌ర్ తో 15 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా సీఎస్కే విశ్వ విజేత‌గా నిలిచింది.

Also Read: Wriddhiman Saha

Leave A Reply

Your Email Id will not be published!