Devon Conway : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా రికార్డులు బద్దలవుతున్నాయి. పరుగుల వరద పారుతోంది. వికెట్లు రాలుతున్నాయి. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్న రీతిలో చితక్కొట్టారు. దీంతో బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో రన్స్ వరద పారింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన మహేంద్ర సింగ్ ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 రన్స్ చేసింది. ఇదే ఐపీఎల్ భారీ స్కోర్ కావడం విశేషం. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కోల్ కతాతో 224 రన్స్ చేసింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే దెబ్బ పడింది. హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ రుతురాజ్ గైక్వాడ్ ను దెబ్బ కొట్టాడు. ఈ తరుణంలో బరిలోకి దిగిన అజింక్యా రహానే తనదైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) దుమ్ము రేపాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఎక్కడా తగ్గలేదు. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కాన్వే 83 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. రహానేతో కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు కాన్వే. మొత్తంగా 226 పరుగులలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : చుక్కలు చూపించిన మ్యాక్స్ వెల్