Dharmapuri Srinivas : ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతి
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు...
Dharmapuri Srinivas : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి దిగ్భ్రాంతికరమని అన్నారు. శ్రీనివాస్(Dharmapuri Srinivas) ఎప్పుడూ హుషారుగా రాజకీయాలను కొనసాగించేవారని… తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే పని చేశారని, డి.శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు.
Dharmapuri Srinivas No More
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీఎస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని అన్నారు. సుదీర్ఘకాలం పాటు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యంలో డిఎస్ ప్రత్యేక ముద్ర వేశారని రేవంత్ గుర్తు చేశారు. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని రేవంత్ ప్రార్థించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డి. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు. సుదీర్ఘకాలం పాటు పార్టీకి విశేష సేవలందించారు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన తరుణంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డీఎస్ కుటుంబానికి మంత్రి తుమ్మల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి ఆత్మీయుడిని కోల్పోయానని పోచారం అన్నారు. నిజామాబాద్ జిల్లాకు డీఎస్ గొప్ప దిక్కుగా అభివర్ణించారు. డిఎస్‌ఎకు పార్టీ సభ్యుడిగా ఉన్న రోజుల నుంచి ఆయన పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పారు. తనను తాను శీను అని పిలుస్తున్నానని చెప్పారు.
Also Read : Anant-Radhika Wedding : అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి పై కీలక అప్డేట్