Dhoni Danny Morrison : కామెంటేట‌ర్ కు ధోనీ స్ట్రాంగ్ కౌంట‌ర్

రిటైర్మెంట్ అవుతారా అన్న ప్ర‌శ్న‌కు

Dhoni Danny Morrison : మ‌హేంద్ర సింగ్ ధోనీ మామూలోడు కాదు. క‌ష్ట‌ప‌డి అంచెలంచెలుగా ఎదిగిన వాడు. ఆపై ఎన్నో క‌ష్టాల‌ను దాటుకుంటూ నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతే కాదు భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన కెప్టెన్. ఇప్ప‌టికే క్రికెట్ నుంచి త‌ప్పుకున్నాడు. కానీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో మాత్రం కొన‌సాగుతున్నాడు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తుతం ఐపీఎల్ 16వ సీజ‌న్ కొన‌సాగుతోంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో కొన‌సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఈ త‌రుణంలో లీగ్ మ్యాచ్ లో భాగంగా ల‌క్నో వాజ్ పేయి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో ఆడింది చెన్నై. వ‌ర్షం కార‌ణంగా ఆట‌ను ర‌ద్దు చేశారు అంపైర్లు.

అంత‌కు ముందు ధోనీ టాస్ గెలిచాడు. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 19.2 ఓవ‌ర్లు ఆడింది ల‌క్నో. 7 విక‌కెట్లు కోల్పోయి 125 ప‌రుగులు చేసింది. ఈ త‌రుణంలో భారీ వ‌ర్సం కుర‌వ‌డంతో ఆట‌ను నిలిపి వేశారు. ఎంత‌కూ త‌గ్గ‌క పోవ‌డంతో ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇరు జ‌ట్లకు ఒక్కో పాయింట్ ను కేటాయించారు.

అంత‌కు ముందు ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ కామెంటేంట‌ర్ డేని మోరిస‌న్ టాస్ వేశాక ధోనీని కుశ‌ల (Dhoni Danny Morrison) ప్ర‌శ్న‌లు వేశాడు. రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటున్నారంటూ ప్ర‌శ్నించాడు. దీనికి దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చాడు దోనీ. నేను కాదు మీరే నిర్ణ‌యం తీసుకున్నారంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ధోనీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!