Shashi Tharoor : ఫ్లైట్ కార‌ణంగా వెళ్ల లేక పోయా – థ‌రూర్

విరాట్ కోహ్లీ ఆట తీరు అద్భుతం

Shashi Tharoor : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ఈ త‌రుణంలో తాను కీల‌క మ్యాచ్ ను చూసేందుకు వెళ్లాల‌ని అనుకున్నాన‌ని కానీ అనుకోకుండా ఫ్లైట్ ఎక్క‌లేక పోయాన‌ని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావించాడు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరొందాడు శ‌శి థ‌రూర్.

ఆయ‌న‌కు మాట‌ల మాంత్రికుడిగా పేరు గాంచాడు. ఈ సంద‌ర్భంగా అద్భుతమైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిన విరాట్ కోహ్లీపై(Virat Kohli) ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లీ ఓ అథ్లెటిక్ హీరో అని కితాబు ఇచ్చాడు శ‌శి థ‌రూర్. విరోచ‌తమైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు.

భార‌త్, పాకిస్తాన్ ఘ‌ర్ష‌ణ‌ను చూసేందుకు తాను గోవా నుంచి వెళ్లాల్సిన విమానాన్ని ఉద్దేశ పూర్వ‌కంగా మిస్ చేసుకున్న‌ట్లు థ‌రూర్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ ఉద‌యం గోవాలో జ‌రిగిన క్యాథ‌లిక్ విశ్వ విద్యాల‌యాల స‌ద‌స్సులో ప్ర‌సంగించిన త‌ర్వాత నేను షెడ్యూల్ చేసిన ఫ్లైట్ ను తిర‌స్క‌రించాన‌ని తెలిపాడు.

త‌దుప‌రి విమానం రాత్రి 9.55 గంట‌ల‌కు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ ఈ టోర్నీలో గొప్ప మ్యాచ్ ల‌లో ఒక దాన్ని చూసి థ్రిల్ అయ్యాన‌ని స్ప‌ష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే కోహ్లీని గొప్ప మేధావి అంటూనే అట్ట‌ర్లీ అద్భుతం అని పేర్కొన‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!