Manish Maheshwari : ఇలా జరుగుతుందని అనుకోలేదు – మనీష్
మాజీ ఇండియా హెడ్ మహేశ్వరి
Manish Maheshwari : మైక్రో బ్లాగింగ్ దిగ్గజ సంస్థ ట్విట్టర్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 3, 798 మందిని సాగనంపారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్. సిఇఓ, సిఎఫ్ఓ, లీగల్ హెడ్ తో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో 7,500 మందికి పైగా పని చేస్తుండగా కేవలం 2,000 మంది ఉద్యోగులతోనే నడపాలని డిసైడ్ అయ్యారు మస్క్.
ఆయన ఇటీవలే రూ. 4,400 కోట్లకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నారు. తను తీసుకున్న వెంటనే చర్యలు ప్రారంభించాడు. షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ట్విట్టర్ మాజీ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి(Manish Maheshwari) స్పందించాడు. శనివారం ఆయన ఓ జాతీయ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
తాను కలలో కూడా ఊహించ లేదని ఇలా జరుగుతుందని పేర్కొన్నాడు. ఒక రకంగా చాలా బాధ కలుగుతోందన్నారు. అంచెలంచెలుగా ప్రపంచంలోనే టాప్ లో నిలిచిన సంస్థ ఇలా ఒడిదుడుకులకు లోను కావడం తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నాడు మనీష్ మహేశ్వరి. సగం మంది భారతీయులను తొలగించాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంటోంది. చాలా సంస్థలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయని పేర్కొన్నారు. ట్విట్టర్ ను మరింత డిఫరెంట్ గా తీసుకు రావాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సంస్థకు మేలు చేయదన్నారు మహేశ్వరి.
ఇదిలా ఉండగా ట్విట్టర్ ఇండియా ప్రొడక్ట్ హెడ్ శిరీష్ అంధరే తన ట్విట్టర్ బయో నుండి తన హొదాను తొలగించారు.
Also Read : ఎలాన్ మస్క్ షాక్ ఉద్యోగులకు ఝలక్