RBI Governor : ఆ ఫోన్ల‌లో డిజిట‌ల్ లావాదేవీలు

స్ప‌ష్టం చేసిన ఆర్బీఐ చీఫ్ దాస్

RBI Governor  : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో డిజిట‌ల్ లావాదేవీల ప్ర‌యారిటీ మ‌రింత పెరిగింది. దీంతో స్మార్ట్ ఫోన్లు లేకుండానే లావాదేవీలు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకుంది ఆర్బీఐ.

ఇక నుంచి ఫీచ‌ర్ ఫోన్లు వాడుతున్న వారికి తీపి క‌బురు చెప్పింది. త‌మ మొబైల్ నుంచి డిజిట‌ల్ లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఆయ‌న యూనైటెడ్ పేమ్స్ ఇంట‌ర్ ఫేస్ 123 పే స‌ర్వీసును ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్. ఇందులో భాగంగా స‌రికొత్త యూఎస్ఎస్డీ ఆధారిత స‌ర్వీనును అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

ఈ ఒక్క ఫీచ‌ర్ ద్వారా 40 కోట్ల మంది ఫీచ‌ర్ ఫోన్ వాడ‌కందారుల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంద‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా స్మార్ట్ ఫోన్ల‌లో ఉన్న ఫీచ‌ర్లు ఫీచర్ ఫోన్లలో ఉండ‌వు. ఓన్లీ కాల్స్ , మెస్సేజ్ లు మాత్ర‌మే వాడుకునేందుకు వీలు క‌లుగుతుంది.

దేశంలో వీరి కోసం డిజిట‌ల్ పేమెంట్ల వెసులుబాటును క‌ల్పించిన‌ట్లు ప్ర‌క‌టించారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్(RBI Governor ). అయితే లావాదేవీలు జ‌ర‌పాలంటే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా డిజిట‌ల్ పేమెంట్స్ సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు శ‌క్తికాంత దాస్.
లావాదేవీల కోసం డిజిట‌ల్ సాథీ పేరుతో తీసుకు వ‌చ్చింది.

ఈ స‌ర్వీస్ ను వెబ్ సైట్ , చాట్ బోట్ ద్వారా ఉప‌యోగించు కోవ‌చ్చ‌ని సూచించారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్. డిజిట‌ల్ చెల్లింపుల‌పై ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉన్న‌ట్ల‌యితే వెబ్ సైట్ ను లేదా కాల్ సెంట‌ర్ కు ఫోన్ చేసి తెలుసు కోవాల‌ని సూచించారు.

Also Read : ప్ర‌త్యేక జాకెట్‌తో బంగారం స్మ‌గ్లింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!