Dil Raju : ‘తొలి ప్రేమ’ను మరువ లేను – దిల్ రాజు
తెలుగు సినీ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిప్రేమ అనేది ఒక జ్ఞాపకమని పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో అద్భుత విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్ , దర్శకుడు కరుణాకరన్ కు, జీవీజీ రాజుకు ప్రత్యేక పేజీలు తప్పక ఉంటాయన్నారు. సినీ రంగ నిర్మాణంలో తన కెరీర్ ఈ చిత్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం ప్రారంభమైందని చెప్పారు. శనివారం ఆయన తొలి ప్రేమతో తనకు ఉన్న బంధం గురించి తెలియ చేశారు.
మాకందరికీ ఇది మరిచి పోలేని చిత్రం..జాపకం కూడా అని పేర్కొన్నారు. నా సినీ ప్రయాణంలో తొలి ప్రేమకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నాకు అప్పట్లో పూర్తిగా తెలియవు. కొన్ని లెక్కలు వేసుకుని సినిమా ఓపెనింగ్ కు వెళ్లానని తెలిపారు. నాకు ఇంకా చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఒక్క పెళ్లి పందిరి మాత్రమే చేశా. జీవీజీ రాజు గారిని కలిశా. డిస్ట్రిబ్యూషన్ ఇవ్వమని కోరా. ఒక్క సిట్టింగ్ లోనే ఓకే అయ్యిందని చెప్పారు దిల్ రాజు(Dil Raju).
ఆ తర్వాత ఆ సినిమాతో నా అసలు ప్రయాణం మొదలైందన్నారు. అద్భుతమైన సినిమాలు ఎన్నో తీసినా తొలి ప్రేమ మాత్రం నాలో ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు దిల్ రాజు. ఆనాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నా వంద రోజుల వేడుకకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారని ,ఇది సినిమాకు ఉన్న బలమని పేర్కొన్నారు. మళ్లీ రిలీజ్ చేస్తున్నాం. తప్పక చూసి ఆదరించాలని కోరారు దిల్ రాజు.
Also Read : MP Vijay Sai Reddy : ఏపీలో మళ్లీ మాదే అధికారం
