Dinesh Karthik : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ 15వ సీజన్ కలిసి వచ్చినట్లుంది. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి ఐపీఎల్ టైటిల్ ను గెలిచే ఛాన్స్ ఆర్సీబీకి ఎక్కువగా ఉందన్నాడు. ఆయన అన్నట్టుగానే ఆ జట్టు అద్భుతమైన ప్రతిభా పాటవాలతో రాణిస్తోంది. ప్రధానంగా కోహ్లీ ఉన్న సమయంలో ఆర్సీబీ తడబడింది.
కానీ డుప్లెసిస్ కు పగ్గాలు ఇచ్చాక దాని పరిస్థితి లో మార్పు వచ్చింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్ లోకి వచ్చింది. ఇక ప్రధానంగా ఆ టీమ్ లో చెప్పు కోవాల్సింది దినేశ్ కార్తిక్(Dinesh Karthik) గురించి.
ఈసారి కీలకంగా మారాడు. జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. కేవలం 34 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. మ్యాచ్ పూర్తయ్యేంత వరకు ఉన్నాడు.
దీంతో 5 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది ఆర్సీబీ. మ్యాచ్ విజయంలో ప్రధాన భూమికను పోషించిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. మరోసారి తన సూపర్ ఫామ్ ను కంటిన్యూగా కొనసాఆగించాడు.
ఇక దినేశ్ తో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్ 34 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స్ లు కొట్టాడు. మొత్తం 55 పరుగులు చేశాడు. ఇక షహబాజ్ అహ్మద్ 21 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 32 పరుగులు చేశాడు.
Also Read : ఐపీఎల్ టైటిల్ రేసులో ఆర్సీబీ