Director Bala : వివాహ బంధానికి బాలా గుడ్ బై

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన డైరెక్ట‌ర్

Director Bala : సినీ రంగంలో ఇటీవ‌ల డివోర్స్ ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇది ఒక ర‌కంగా సినీ అభిమానుల‌కు కోలుకోలేని షాక్ ఇస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ముఖ న‌టి స‌మంత అక్కినేని ఉన్న‌ట్టుండి తాను అక్కినేని నాగ చైత‌న్య తో విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దేశంలోనే స్టార్ న‌టుడిగా పేరొందిన ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ సైతం బిగ్ షాక్ ఇచ్చాడు. తామిద్ద‌రం విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక అమీర్ ఖాన్ కొన్నేళ్ల బంధాన్ని తెంచుకున్నాడు గౌరీతో.

తాజాగా త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిగా పేరొందిన బాలా(Director Bala) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్ప‌టికే ఆయ‌న అద్భుత‌మైన సినిమాలు తీశాడు.

విచిత్రం ఏమిటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సంవ‌త్స‌రాల పాటు కొనసాగుతూ వ‌చ్చిన వివాహ బంధానికి చెక్ పెట్టాడు. ఇవాల్టి నుంచి తామిద్ద‌రం విడి పోతున్న‌ట్లు, విడాకులు తీసుకుంటున్న‌ట్లు తానే స్వ‌యంగా ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు బాలా.

లీగ‌ల్ గా త‌న భార్య మ‌ధు మలార్ కు విడాకులు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా తామిద్ద‌రం వేర్వేరుగా ఉంటున్నామ‌ని తెలిపాడు బాలా.

ఇద్ద‌రూ త‌మ‌కు విడాకులు కావాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరిద్ద‌రికి ఒక కూతురు ఉంది. బాలా త‌మిళంలోనే కాదు తెలుగు లో సైతం ప‌లు సినిమాలు తీశాడు.

జాతీయ స్థాయిలోనే కాదు త‌మిళంలో సామాజిక నేప‌థ్యం ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరొందాడు బాలా. ప్ర‌స్తుతం బాలాకు సంబంధించిన ఈ అంశం క‌ల‌కలం రేగింది.

Also Read : ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!