Priyanka Chaturvedi : పార్లమెంట్ సాక్షిగా వివక్ష నిజం – ప్రియాంక
ఎంపీ చతుర్వేది తీవ్ర ఆవేదన
Priyanka Chaturvedi : మహిళా సాధికారితకు పెద్ద పీట వేస్తానంటూ మాయ మాటలు చెబుతూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది.
ఇదిలా ఉండగా ఇటీవల మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న ప్రధాన డిమాండ్ ను మరోసారి తెరపైకి తీసుకు వచ్చారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.
ఆయనతో పాటు ఎంపీ సుప్రియా సూలే కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సమాజపు అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న మహిళల పట్ల ఎందుకు వివక్ష కొనసాగుతోందంటూ నిలదీశారు ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi).
బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా నిలదీసింది. ఇది ఒక చిన్న మార్పులా అనిపించవచ్చు. కానీ మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ఇది ఆచరణలోకి వచ్చే సరికి చాలా దూరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
వద్దు సార్ ఇక పై లేదంటూ పేర్కొనడం కలకలం రేపింది. ఎంపీ లేఖ తర్వాత పార్లమెంట్ రూల్ మార్చింది. శివసేన చెందిన ప్రియాంక చతుర్వేది పార్లమెంటరీ ప్రశ్నలకు ప్రత్యుత్తరాలలో సార్ అని ఎత్తి చూపారు.
ఆమె గత నెలలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు. పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందించబడ్డాయి. సమాధానం ప్రతికూలంగా ఉన్న సందర్భాల్లో నో, సర్ అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు.
ఒక మహిళా పార్లమెంటేరియన్ గా ఇది సంబంధించిందంటూ పేర్కొన్నారు ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi). ప్రజాస్వామ్య దేవాలయం..పార్లమెంట్ ద్వారా సంస్థాగత లింగ ప్రధాన స్రవంతిని గమనించాలంటూ హెచ్చరించింది.
Also Read : రాజస్థాన్ లో సీఎం వర్సెస్ పైలట్