Johnny Depp Offer : జానీ డెప్ కు బంప‌ర్ ఆఫ‌ర్

రూ. 2,355 కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న

Johnny Depp Offer : ఒక్కోసారి అదృష్టం త‌లుపు త‌డితే కోట్లు వ‌చ్చి వాలి పోతాయి. అదే దుర‌దృష్టం వెంటాడితే ఉన్న‌వ‌న్నీ ఊడ్చుకు పోతాయి. నిన్న‌టి దాకా హాలీవుడ్ న‌టుడు జానీ డెప్(Johnny Depp Offer)  ను అమెరికాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థ‌లు అత‌డితో సినిమాలు తీశాయి.

కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. కానీ ఉన్న‌ట్టుండి జానీ డెప్ పై మాజీ భార్య అంబర్ హెరాల్డ్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసిస్తున్నాడంటూ కోర్టుకు ఎక్కింది.

ఇంకేం నిన్న‌టి దాకా ఎర్ర తివాచీలు ప‌రిచిన సంస్థ‌ల‌న్నీ కాంట్రాక్టులు ర‌ద్దు చేసుకున్నాయి. తీరా యావ‌త్ ప్ర‌పంచం అత‌డిపై ఆమె చేసిన ఆరోప‌ణ‌లు నిజమా కాదా అని ఉత్కంఠ‌తో ఎదురు చూశాయి.

జ్యూరీ ఊహించ‌ని రీతిలో జానీ డెప్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అంతే కాదు త‌న ప‌రువుకు భంగం క‌లిగించినందుకు భారీ మొత్తంలో న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలంటూ మాజీ భార్య‌ను ఆదేశించింది.

దీంతో ఆనందం ప‌ట్ట‌లేక డ్యాన్సులు చేశాడు జానీ డెప్(Johnny Depp Offer) . ఇది ప‌క్క‌న పెడితే త‌న‌తో కాంట్రాక్టులు ర‌ద్దు చేసుకున్న బ‌డా ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌ల‌న్నీ ఇప్పుడు రా ర‌మ్మంటున్నాయి.

నువ్వు లేక పోతే ఉండ‌లేమంటున్నాయి. ఎన్ని కోట్లు అయినా స‌రే నీకు ఇస్తామంటూ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా ఓ పేరొందిన సంస్థ ఏకంగా జానీ డెప్ కు రూ. 2,355 కోట్లు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

మొత్తంగా జానీ డెప్ ద‌శ తిరిగింది. పంట పండింది. ఇంత‌కూ అత‌డిని విజేత‌గా నిలిపింది మాత్రం ఓ యంగ్ లాయ‌ర్ కావ‌డం విశేషం.

Also Read : గూగుల్ సెర్చింగ్ లో అల్లు అర్జున్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!