CM YS Jagan : డిసెంబర్ నాటికి ఇళ్ల పంపిణీ – జగన్
వివిధ శాఖలపై సీఎం సమీక్ష
CM YS Jagan : ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికల్లా రాష్ట్రంలో టిడ్కో ద్వారా ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణం, రెవిన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ది, గిరిజన అభివృద్దిపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని అన్నారు సీఎం(CM YS Jagan). జగనన్న కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
ఇదిలా ఉండగా 2022-23 సంవత్సరానికి ఇప్పటి దాకా రూ. 4,318 కోట్ల విలువైన ఇళ్లను నిర్మించినట్లు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు ఉన్నతాధికారులు. మొదటి దశలో 15.6 లక్షల ఇళ్లు, రెండో విడతలో 5.56 లక్షల ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు.
ప్రస్తుతం వర్షాల తాకిడి ఉందని అవి తగ్గాక మరింత వేగవంతం చేస్తామన్నారు. దశల వారీగా 70,000 ఇళ్లను పూర్తి చేసేందుకు ప్లాన్ చేశామని చెప్పారు.
డిసెంబర్ నాటికల్లా టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇక నాడు నేడుపై సమీక్ష చేపట్టారు.
గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
రెండో దశలో హాస్టళ్లలో పారిశుధ్యంపై ఫోకస్ పెట్టాలని, తయారు చేసిన కాస్మోటిక్స్ నాణ్యతగా ఉండాలని, విద్యా కానుక కిట్ లలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం. ఆహరం బాగుండాలన్నారు.
Also Read : దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 4,500 బస్సులు