Divya Vani Join : కాంగ్రెస్ లో చేరిన నటి దివ్యవాణి
తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్
Divya Vani Join : హైదరాబాద్ – తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉంటూ తన వాయిస్ వినిపిస్తూ వచ్చిన నటి దివ్యవాణి ఆ పార్టికి గుడ్ బై చెప్పారు. పార్టీలో తాను ఇముడలేక పోతున్నానని వాపోయారు. బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కండువా కప్ప పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే.
Divya Vani Join in Congress
వెండి తెరపై నటిగా, బుల్లి తెరపై ప్రయోక్తగా గుర్తింపు పొందారు దివ్య వాణి(Divya Vani). ఆమె పలు విజయవంతమైన సినిమాలలో నటించారు. టీడీపీలో చేరాక సమస్యలపై స్పందిస్తూ వార్తల్లో నిలిచారు. కానీ అక్కడ ఆమెను వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఇముడ లేక పోయారు. తనపై కావాలని లేనిపోనివి సృష్టించూ వెళ్లి పోయేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు జరుగుతున్న అన్యాయం గురించి, పార్టీలో గుర్తింపు లేక పోవడం గురించి పదే పదే దివ్యవాణి సీరియస్ కామెంట్స్ చేశారు. ఒకానొక దశలో మీడియా సాక్షిగా తీవ్ర ఆవేదన చెందారు. తాను పార్టీ చీఫ్ చంద్రబాబుకు, నారా లోకేష్ కు తెలిపినా పట్టించు కోలేదని మండిపడ్డారు .
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ సినీ నటి విజయ శాంతి కూడా ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Also Read : Madhu Yashki Goud : మధు యాష్కి వినూత్న ప్రచారం