DY CM DK Shiva Kumar : కాంగ్రెస్ బిక్షతోనే బీజేపీ అధ్యక్షుడుకు ఎమ్మెల్యే పదవి

DK Shiva Kumar : కాంగ్రెస్‌ భిక్షతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఎమ్మెల్యే అయ్యారని డీసీఎం డీకే శివకుమార్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం ఓ కార్యక్రమంలో డీసీఎం డీకే శివకుమార్‌ మాట్లాడిన వేళ ఇప్పుడు పదవి వచ్చిందని విజయేంద్ర అన్నా అంటూ పిలుస్తారని, అతడు ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్‌ భిక్ష అన్నారు. అతడిపై నాగరాజ్‌ వంటి బలమైన అభ్యర్థి రంగంలో ఉంటే విజయేంద్ర శాసనసభకు వచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు.

DK Shiva Kumar Shocking Comments

బీజేపీ రెబెల్‌ నేత బసనగౌడ పాటిల్‌యత్నాళ్‌ తరచూ విజయేంద్ర ఒప్పందపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ స్తబ్ధుగా కావడానికి కీలకనేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర పెద్దలతో అడ్జస్టుమెంట్‌గా వ్యవహరిస్తుండడమే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరుణంలోనే డీసీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చినట్లయింది.

Also Read : Minister Bandi Sanjay : క్రమబద్ధీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు 50 కోట్ల స్కామ్

Leave A Reply

Your Email Id will not be published!