DK Shiva Kumar : క‌న్న‌డ నాట సాంస్కృతిక స‌మ్మేళ‌నం

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

DK Shiva Kumar : క‌ర్ణాట‌క – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత రాష్ట్ర వైభ‌వాన్ని చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

DK Shiva Kumar Traditional Events

డిసెంబ‌ర్ 1 నుండి 11వ తేదీ వ‌ర‌కు క‌న్న‌డ నాట సాంస్కృతిక స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. న‌గ‌ర వ్యాప్త ఉత్స‌వం చ‌రిత్ర‌, చ‌ల‌న చిత్రాలు, క‌ళ‌లు, ఆహారం, సంస్కృతికి సంబంధించిన స‌మ్మేళ‌నం జ‌రుగుతుంద‌న్నారు డీకే శివ‌కుమార్.

ఇందులో 40 మంది ప్ర‌ముఖ భాగ‌స్వామ్యుల‌తో 40 స్థానాల‌లో 300 ఈవెంట్ లు జ‌రిగేందుకు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త దేశ క‌ళ‌లు, సాంస్కృతిక క్యాలెండ‌ర్ లో ఇది ఒక ముఖ్య‌మైన మైలు రాయిగా నిలిచి పోతుంద‌ని అన్నారు డిప్యూటీ సీఎం(DK Shiva Kumar). ప్ర‌తి ఒక్క‌రు క‌లిసి సాంస్కృతిక వేడుక‌ల చైత‌న్యానికి స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

తాము కొలువు తీరిన వెంట‌నే ఇచ్చిన 5 హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. క‌న్న‌డ ప్రాంతానికి చెందిన ప్ర‌తి ఒక్క‌రు, అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ సాంస్కృతిక ఉత్స‌వాలలో పాలు పంచుకోవాల‌ని కోరారు డీకే శివ‌కుమార్.

Also Read : Siddaramaiah : సిద్ద‌రామ‌య్య‌కు ఈసీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!