DK Shiva Kumar : తుంగభద్ర డ్యామ్ గేట్ డ్యామేజ్ పై స్పందించిన డీకే శివకుమార్

అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది...

DK Shiva Kumar : తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్(DK Shiva Kumar) మీడియాతో మాట్లాడుతూ… తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమని అన్నారు. ఈ డ్యామ్ కర్నాటక – ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని.. రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం శివకుమార్(DK Shiva Kumar) కోరారు.

DK Shiva Kumar Comment

అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది. తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు.

మరోవైపు ఆదివారం ఉదయం డ్యామ్‌ను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాట్ గేటు కొట్టుకోని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది. సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.

తుంగభద్ర డ్యామ్ గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని కోరారు. అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. డ్యామ్ 19వ గేటు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు గుర్తించారు.

Also Read : Bhatti Vikramarka : మోహన్ బాబు పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!