DK ShivaKumar : మహిళా రెజ్లర్లకు రక్షణేది – డీకే
కేంద్ర సర్కార్ పై సీరియస్ కామెంట్స్
DK ShivaKumar : మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాలు, పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మద్దతు ప్రకటించారు. సోమవారం తాను స్వయంగా పాల్గొంటానని స్పష్టం చేశారు.
తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK ShivaKumar) మహిళా రెజ్లర్ల అంశంపై స్పందించారు. ఇది పూర్తిగా అన్యాయమని ఆవేదన చెందారు. మహిళా రెజ్లర్లు తమకు న్యాయం కావాలని కోరుతున్నారని, చివరకు గత్యంతరం లేక రోడ్డుపైకి వచ్చారని తెలిపారు. ఇంత జరుగుతున్నా నిస్సిగ్గుగా కేంద్ర సర్కార్ మిన్నకుండి పోయిందని మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చివరకు తమపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
అసలు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చూసి దేశం తల దించు కుంటోందని ఆవేదన చెందారు. మహిళా రెజ్లర్లు దేశం కోసం ఆడుతున్నారు. గత కొన్నేళ్లుగా వాళ్లు భారతీయ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఎగిరేలా పతకాలు సాధించి పెట్టారు. కానీ వాళ్లే తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నా పట్టించుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు డీకే శివకుమార్(DK ShivaKumar). తాము బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Also Read : అవినీతికి అందలం చర్యలు శూన్యం