Anil Deshmukh : అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ ఇవ్వొద్దు – సీబీఐ

మ‌నీ లాండ‌రింగ్ కేసులో మాజీ మంత్రిపై కేసు

Anil Deshmukh : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ తీవ్ర అభ్యంత‌రం తెలియ చేయ‌డం కీల‌కంగా మారింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు(Anil Deshmukh) ఇటీవ‌లే బెయిల్ మంజూరు చేసింది. దీనిపై త‌మ‌కు అభ్యంత‌రాలు ఉన్నాయంటూ స్ప‌ష్టం చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ జ‌రుపుతోంది.

ఇప్ప‌టికే అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ రంగంలోకి దిగింది. కేసు న‌మోదు చేసింది. ఈ మేర‌కు మాజీ హోం శాఖ మంత్రిని అరెస్ట్ చేసింది. తీరా త‌న‌కు ఆరోగ్యం బాగో లేదంటూ అందుకే తాను జైలులో ఉండ‌లేనంటూ పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా మ‌నీలాండ‌రింగ్ కేసులో గ‌త ఏడాది 2021 న‌వంబ‌ర్ లో 71 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఎన్సీపీ నాయ‌కుడు అరెస్ట్ అయ్యాడు. ఆర్డ‌ర్ రోడ్ జైలులో ఉన్నారు అనిల్ దేశ్ ముఖ్. మాజీ మంత్రికి బెయిల్ మంజూరు చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది.

ఆయ‌న‌పై న‌మోదైన అవినీతి కేసులో బెయిల్ పిటిష‌న్ ను వ్య‌తిరేకిస్తూ సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) శుక్ర‌వారం త‌న స‌మాధానం దాఖ‌లు చేసింది. కాగా మాజీ మంత్రికి బాంబే హైకోర్టు గ‌త వారం బెయిల్ మంజూరు చేసింది.

ఈ నేప‌థ్యంలో అవినీతి కేసులో బెయిల్ కోసం ప్ర‌త్యేక సీబీఐ కోర్టును ఆశ్ర‌యించారు అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh).

Also Read : సీఎం హిమంత శ‌ర్మకు భ‌ద్ర‌త పెంపు

Leave A Reply

Your Email Id will not be published!