Donald Trump: ఆపరేషన్‌ సిందూర్‌ కి ముందు ట్రంప్‌,పాక్‌ ల మధ్య చీకటి ఒప్పందం ?

ఆపరేషన్‌ సిందూర్‌ కి ముందు ట్రంప్‌,పాక్‌ ల మధ్య చీకటి ఒప్పందం ?

Donald Trump : జమ్మూకాశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో… ఆ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి… పాకిస్తాన్(Pakistan), పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేటమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు పాకిస్తాన్ తో జరిగిన సిందు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనితో భారత్ లోని సరిహాద్దు గ్రామాల్లో డ్రోన్లు, క్షిపణుల దాడులతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే పాకిస్తాన్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే… పాకిస్తాన్ పై మరోవైపు దాడులు చేసి వెన్నులో వణుకు పుట్టించాయి భారత భద్రతా బలగాలు. దీనిలో కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్… అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ద్వారా కాల్పుల విరమణకు రాజీకు వచ్చింది. ఇదే విషయాన్ని ఇరు దేశాల ప్రతినిధుల కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా వెల్లడించాడు.

అయితే భారత్, పాకిస్తాన్ ల మధ్య రాజీ కుదర్చడంపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయినప్పటీకీ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో భారత్ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రభుత్వ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది.

అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది. ఈ ఒప్పందం తర్వాత వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్‌ ప్రభుత్వం నియమించింది.

Donald Trump – అమెరికా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్

ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌ కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా స్వాగతం పలికారు. ఆ అమెరికన్‌ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్‌ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌ కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్‌ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది.

ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.

పాక్‌-ట్రంప్‌ చీకటి ఒప్పందంపై అనుమానం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : Minister S Jaishankar: చరిత్రలో తొలిసారిగా తాలిబన్ మంత్రితో జై శంకర్‌ చర్చలు

Leave A Reply

Your Email Id will not be published!