Donald Trump: ‘హెచ్‌1బీ’ వీసా ఫీజు పెంపుపై వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన

‘హెచ్‌1బీ’ వీసా ఫీజు పెంపుపై వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్‌1 బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వైట్‌హౌస్‌ కీలక ప్రకటన చేసింది. ఆదివారం నుంచి హెచ్‌1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే హెచ్‌1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్‌ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్‌ ఆదేశాలను అమలు చేసే యూఎస్‌ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గ దర్శకాల ప్రకారం.. హెచ్‌ 1 బీ వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది.

Donald Trump – మినహాయింపులు ఇవే:

అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు

అమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులు

వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌసులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు

ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది.

అయితే ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసా దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే దాఖలైన కానీ ఇంకా వీసా పొందని ధరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుందని ట్రంప్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Also Read : Sabarimala: శబరిమలకు చేరుకున్న ద్వారపాలక విగ్రహ తాపడాలు

Leave A Reply

Your Email Id will not be published!