Donald Trump : మ‌న దేశం న‌ర‌కానికి పోతోంది – ట్రంప్

త‌న అరెస్ట్ పై అమెరికా మాజీ చీఫ్ కామెంట్స్

Donald Trump : అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా కోర్టు ఆవ‌ర‌ణ‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏకంగా త‌న దేశంపైనే ఆయ‌న నిప్పులు చెరిగారు. మ‌న దేశం (అమెరికా) నేరుగా న‌ర‌కానికి పోతోందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన ఈ కామెంట్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

2016లో అమెరికాలో మోస్ట్ పాపుల‌ర్ పోర్న్ స్టార్ గా పేరొందిన స్టార్మీ డేనియ‌ల్స్ కు డ‌బ్బులు చెల్లించారంటూ కేసు న‌మోదైంది. ఈ కేసుకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం అమెరికా మాజీ చీఫ్ కు 76 ఏళ్లు. మాన్ హాట‌న్ గ్రాండ్ జ్యూరీ గ‌త వారం ట్రంప్ పై అభియోగాలు మోపింది.

విచిత్రం ఏమిటంటే అగ్ర రాజ్యంగా పేరొందిన అమెరికా దేశ చ‌రిత్ర‌లోనే ఇది చీక‌టి రోజుగా భావించ‌వ‌చ్చు. నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మొద‌టి మాజీ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ కావ‌డం విశేషం. జ్యూరీ ఆవ‌ర‌ణ‌లో డొనాల్డ్ ట్రంప్ తాను నిర్దోషిన‌ని , త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవ‌న్నారు ట్రంప్(Donald Trump).

Also Read : దేశాధ్య‌క్షుడైనా సామాన్యుడైనా ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!