Donald Trump : ట్రంప్ ఉద్యోగ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన..ఒకేసారి 9500 మంది తొలగింపు

ఏకంగా వేలమందిని ఒకేసారి తొలగించింది...

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉద్యోగ యంత్రాంగంలో పూర్తి స్థాయి ప్రక్షాళన మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 9,500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది కూడా ఉన్నారు. ఇంకా.. అంతర్గత వ్యవహారాల విభాగం, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య, మానవ సేవల విభాగాల్లోనూ సిబ్బందికి కోత విధించారు. ఫెడరల్‌ ఉద్యోగస్వామ్యాన్ని స్థిరీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌(Donald Trump) పదేపదే చెప్పేవారు. ఇందులోభాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో ‘డోజ్‌’ చేసిన సిఫారసుల ఆధారంగా ట్రంప్‌(Donald Trump) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏకంగా వేలమందిని ఒకేసారి తొలగించింది. ఉద్వాసనకు గురైనవారిలో ఏడాదికాలంగా ప్రొబేషన్‌లో ఉంటూ ఇంకా పర్మినెంట్‌ కానివారే ఎక్కువమంది ఉన్నారు. ఇక.. కన్య్జూమర్‌ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ బ్యూరో వంటి స్వతంత్ర సంస్థలు సిబ్బంది కొరతతో దాదాపు మూతబడే పరిస్థితి వచ్చింది. బ్యూరోలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి సైతం ఉద్యోగాలు ఊడాయి. ఉద్యోగులను పెద్దఎత్తున కోల్పోయిన ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసు విభాగంలో వచ్చేవారం మరిన్ని కోతలు ఉంటాయని రాయిటర్స్‌ సంస్థ కథనం ప్రచురించింది. కాగా, స్వచ్ఛంద పదవీవిరమణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను ఇప్పటివరకు 75వేలమంది అంగీకరించారని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

Donald Trump Removes..

సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని అమెరికా నిషేధించింది. అలాగే, మిలిటరీలో లింగ మార్పిడి వైద్య ప్రక్రియపైనా వేటు వేసింది. ఈ మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల్లో మరొకదాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) నెరవేర్చారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్‌ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.సైన్యంలో ట్రాన్స్‌జెండర్‌ భావజాలాన్ని అనుమతించబోమన్నది ఆ ఉత్తర్వుల్లో ఒకటి. దీనిపై మిలిటరీ ‘ఎక్స్‌’లో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘తమను తాము ట్రాన్స్‌జెండర్లుగా భావించుకునేవారి నియామకాన్ని సైన్యంలో తొలగిస్తున్నాం. సర్వీసులో ఉండగా లింగ మార్పిడి విధానాలను అనుమతించబోం.

అమెరికాకు నిస్వార్థంగా సేవలు అందించాలనుకునే జెండర్‌ డిస్ఫోరియా వ్యక్తులను మాత్రం యథాతథంగా గౌరవిస్తాం’’ అని తెలిపింది. కాగా, సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై ఉన్న నిషేధాన్ని 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తొలగించారు. తాను అధికారంలోకి రాగానే తిరిగి వారిపై నిషేధం విధిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక మిలిటరీ శక్తి కలిగిన దేశంగా అమెరికా ఎదగాలంటే ట్రాన్స్‌జెండర్‌ భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కాగా, మహిళల క్రీడాపోటీల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రవేశాన్ని ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఇటీవలి ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున గెలిచిన ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ సారా మెక్‌బ్రైడ్‌ను మహిళల బాత్రూమ్‌లోకి అనుమతించరాదంటూ అధికారిక రిపబ్లికన్లు ఏకంగా తీర్మానమే చేశారు.

Also Read : Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Leave A Reply

Your Email Id will not be published!