Rishabh Pant : నన్ను ఇంకొకరితో పోల్చకండి – పంత్
వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అసహనం
Rishabh Pant : దేశ వ్యాప్తంగా రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా గత కొంత కాలంగా వరుసగా విఫలం అవుతూ వస్తున్నా బీసీసీఐ, టీమ్ మేనేజ్ మెంట్ , కోచ్ పంత్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రధానంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ రాణిస్తున్నా పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా భారత మాజీ క్రికెటర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శాంసన్ ను ఎంపిక చేయక పోవడంపై. ప్రధానంగా బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువై పోయాయని, ప్రధానంగా అది బీజేపీ ఆఫీసుగా మారిందన్న విమర్శలు లేక పోలేదు.
న్యూజిలాండ్ టూర్ లో వరుసగా విఫలమైనా రిషబ్ పంత్(Rishabh Pant) నే కొనసాగించారు. చివరి మూడో వన్డేలో సైతం పక్కన పెట్టారు శాంసన్ ను. మ్యాచ్ సందర్భంగా పంత్ ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లేతో మాట్లాడాడు. తాను అద్భుతంగా ఆడుతున్నానని, తనకు ఇప్పుడు 24 ఏళ్లని ఇంకా బోలెడు సమయం ఉందన్నాడు.
తనను ఇంకొకరితో పోల్చవద్దంటూ అసహనం వ్యక్తం చేశాడు. తన ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని గొప్పలు పోయాడు. ప్రస్తుతం పంత్ చేసిన కామెంట్స్ పై క్రికెట్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
అన్ని ఫార్మాట్ లలో తాను గతంలో రాణించానని ప్రస్తుతం ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు రిషబ్ పంత్. వన్డే ఫార్మాట్ లో నాలుగు లేదా ఐదో స్థానంలో రావాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం పంత్ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
Also Read : మూడో వన్డే లో శాంసన్ కు దక్కని ఛాన్స్