Jos Butler Six : జోస్ బ‌ట్ల‌ర్ మామూలోడు కాద‌ప్పా

డెడ్ బాల్స్ వ‌ద‌ల‌ని స్టార్ హిట్ట‌ర్

Jos Butler Six : మ‌నోళ్ల‌కు ఎదురుగా వ‌చ్చిన బాల్స్ ఆడాలంటే మ‌హా బ‌ద్ద‌కం. ఐపీఎల్ పై ఉన్నంత ఫోక‌స్ టెస్టులు, వ‌న్డేల‌పై ఉండ‌డం లేదన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రి ఇంగ్లండ్ టూర్ లో ఉన్న భార‌త జ‌ట్టుకు ఆతిథ్య జ‌ట్టు స‌వాల్ విసురుతోంది.

ఇప్ప‌టికే స్వ‌దేశంలో న్యూజిలాండ్ కు చుక్క‌లు చూపించింది. సీరీస్ గెలుపొందింది. ఇక ఆ జ‌ట్టుతో త‌ల‌ప‌డాలంటే చాలా చెమ‌టోడ్చాల్సి ఉంది.

ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించిన ఇంగ్లండ్ స్టార్ హిట్ట‌ర్, ఆ జ‌ట్టు వ‌న్డే

వైస్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Six) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు.

ఎలాంటి బంతులైనా స‌రే, ఎలా వ‌చ్చినా స‌రే, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో ఎంత‌టి స‌త్తా క‌లిగిన బౌల‌ర్లు అయినా స‌రే చుక్క‌లు చూపిస్తున్నాడు. దంచి కొడుతున్నాడు. ట‌చ్ చేస్తే చాలు ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురుస్తోంది.

డెబ్ బాల్ , వైడ్ బాల్, నో బాల్ ఏది వేసినా దాడి చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు జోస్ బ‌ట్ల‌ర్. తాజాగా సెన్సేష‌న్ సిక్స్ కొట్టాడు. నెద‌ర్లాండ్స్ తో

జ‌రిగిన వ‌న్డే సీరీస్ లో భాగంగా మూడో వ‌న్డేలో 86 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు.

రెండో వ‌న్డే లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 162 ప‌రుగుల్ని చేశాడు. బ‌ట్ల‌ర్ దెబ్బ‌కు ఇంగ్లండ్ 3-0 తేడాతో సీరీస్ చేజిక్కించుకుంది. 64 బంతులు

మాత్ర‌మే ఆడిన బ‌ట్ల‌ర్ 7 ఫోర్లు 5 సిక్స‌ర్లు కొట్టాడు.

అయితే ఓ సిక్స్ మాత్రం సెన్సేష‌న్ గా మారింది. అదే వైర‌ల్ గా ప్ర‌స్తుతం న‌డుస్తోంది. ఇన్నింగ్స్ 29వ ఓవ‌ర్ లో నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ పాల్ వాన్

మీక్రిన్ వేశాడు.

షార్ట్ పిచ్ వేసేందుకు య‌త్నించ‌గా అది క్రీజు దాటి పోయింది. రెండు సార్లు పిచ్ పై ప‌డిన బంతిని సిక్స‌ర్ కొట్టాడు. డెడ్ బాల్ గా ప్ర‌క‌టించాడు అంపైర్. నో బాల్ ఇచ్చి, ఫ్రీ హిట్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

బ‌ట్ల‌ర్ సిక్స‌ర్ బాదాడు. ఇక మొద‌ట బ్యాటింగ్ చేసిన నెద‌ర్లాండ్స్ 245 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది. దానిని ఇంగ్లండ్ 30.1 ఓవ‌ర్ లోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యింది.

Also Read : ఐపీఎల్ ఆట కాదు ప‌క్కా వ్యాపారం – ల‌తీఫ్

Leave A Reply

Your Email Id will not be published!