Double XL Movie : హుమా ఖురేషీ..ధావ‌న్ హ‌ల్ చ‌ల్

డ‌బుల్ ఎక్సెల్ మూవీ వైర‌ల్

Double XL Movie :  ప్ర‌ముఖ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ , న‌టి హుమా ఖురేషీ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి సోష‌ల్ మీడియాలో. ఇద్ద‌రూ త‌మ త‌మ రంగాల‌లో టాప్ గా కొన‌సాగుతున్నారు. ధావ‌న్ జ‌గ‌మెరిగిన క్రికెట‌ర్. ప్ర‌స్తుతం వ‌న్డే జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఇక హుమా ఖురేషీ మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో కొన‌సాగుతున్నారు.

తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన స్టిల్స్ వైర‌ల్ అయ్యాయి. సోనాక్షి సిన్హా , హుమా ఖురేషీ కి సంబంధించి రాబోయే చిత్రం డుబ‌ల్ ఎక్సెఎల్(Double XL Movie) నుండి స్టిల్ విడుద‌లైంది. దీనికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట‌ర్ గా ఉన్న ధావ‌న్ మొద‌టిసారిగా న‌టుడిగా అరంగేట్రం చేయ‌నున్నాడు.

శిఖ‌ర్ న‌ల్ల‌టి సూట్ లో ద‌ర్శ‌నం ఇచ్చాడు. ఇక ఎరుపు రంగు గౌన్ ధ‌రించిన హుమా ఖురేషీ తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డ‌బుల్ ఎక్స్ ఎల్ టీజ‌ర్ లో బాడీ ర‌కాలు, సైజుపై అబ్బాయిల డ‌బుల్ స్టాండ‌ర్డ్స్ పై సోనాక్షి సిన్హా, హుమా ఖురేషీ స‌ర‌దాగా కామెంట్ చేయ‌డం, న‌వ్వ‌డం హైలెట్ గా నిలిచింది.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. ఈ సినిమా అనేది ఇద్ద‌రు ప్ల‌స్ సైజ్ మ‌హిళ‌ల ప్ర‌యాణాన్ని అన్వేషించే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ డ్రామా. హెల్మెట్ ఫ్రేమ్ స‌త్ర‌మ్ ర‌మ‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 4న నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.

Also Read : అత‌ను ఎప్ప‌టికీ నాతోనే ఉంటాడు

Leave A Reply

Your Email Id will not be published!