DSP Suspension : వైసీపీతో అంటకాగిన డీఎస్పీల బదిలీ వేటు
తుళ్ళూరు డీఎస్పీ గా రాజధాని రైతులపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
DSP Suspension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీతో అంట కాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర రెడ్డి, ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారు. రాజంపేటకు బదిలీ అయినా కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పని చేశారు. తుళ్ళూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బదిలీ అయ్యారు. పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
DSP Suspension in AP
తుళ్ళూరు డీఎస్పీ గా రాజధాని రైతులపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్‌ను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఈ రోజు రేపటిలో భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయనుంది. వైసీపీతో అంట కాగిన వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాడిపత్రిలో పని చేసి టీడీపీ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చైతన్యపై జేసీ అనుచరులు 23 ప్రైవేటు కేసులు వేశారు. చైతన్యపై శాఖాపరమైన విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. నానా రచ్చ చేశారు. అసలు ఆయనను ఎవరు రప్పించారనే కోణంలో సిట్ దర్యాప్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీ చైతన్య అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో డీఎస్సీ అంటకాగారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) ఇంటికి మే నెల 14వ తేదీ అర్ధరాత్రి వెళ్లి డీఎస్సీ చైతన్య వెళ్లారు. అక్కడ ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్‌తోపాటు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. అప్పట్లో ఇదంతా వైసీపీ కావాలని చేయించిందంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి చైతన్యపై ఇన్నాళ్లకు బదిలీ వేటు పడింది.
Also Read : Telangana Governor : తెలంగాణ నయా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న జిష్ణు దేవ్ వర్మ