Faf Du Plessis : డుప్లెసిస్ కు షాక్ బీసీసీఐ జరిమానా
రూ. 12 లక్షలు చెల్లించాల్సిందే
Faf Du Plessis : ఐపీఎల్ 16వ సీజన్ లో కోలుకోలేని షాక్ తగిలింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ ఫాఫ్ డుప్లెసిస్ కు(Faf Du Plessis). లీగ్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. కానీ అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఛేదించి గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
ఆఖరి బంతికి అవేష్ ఖాన్ రన్ తీయడంతో ఉత్కంఠ భరిత పోరుకు తెర పడింది. చివరకు లక్నో చేతికి గెలుపు చిక్కింది. మొత్తం ఆ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలుపొంది ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్ కు సంబంధించి ఇద్దరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సీరియస్ అయ్యింది. వారిలో ఒకరు లక్నో సూపర్ జెయింట్స్ కు చెందిన అవేష్ ఖాన్ కాగా మరొకరు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.
నాన్ స్ట్రైకర్స్ ఎండ్ కు చేరుకున్న వెంటనే అవేష్ ఖాన్ తన హెల్మెట్ తీసి నేల పైకి విసిరాడు. దీనిని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది బీసీసీఐ. మరో వైపు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది. దీంతో మ్యాచ్ ఓటమి బాధల్లో ఉ్న ఆర్సీబీ స్కిప్పర్ కు ఇది పుండు మీద కారం చల్లినట్లయింది.
Also Read : అవేష్ ఖాన్ పై బీసీసీఐ చర్య