Faf Du Plessis : ఐపీఎల్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ ను డిక్లేర్ చేసింది బీసీసీఐ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఆర్సీబీ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది.
ఇంత వరకు ఆర్సీబీ స్కిప్పర్ గా ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పలువురు పేర్లను పరిశీలించింది.
చివరకు అంతా అనుకున్నట్లుగానే వరల్డ్ క్రికెట్ లో టాప్ ప్లేయర్ గా ఉన్న సఫారీ క్రికెటర్ డుప్లెసిస్(Faf Du Plessis) ను ఆర్సీబీ కెప్టెన్ గా నియమిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో ఈ స్టార్ ఆటగాడిని ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.
గతంలో సౌతాఫ్రికా జట్టుకు మనోడు స్కిప్పర్ గా ఉన్నాడు. అతడి హయాంలోనే గణనీయమైన విజయాలు నమోదు చేసింది సఫారీ టీం. దీంతో అన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఆర్సీబీ మేనేజ్ మెంట్ డుప్లెసిస్ వైపు మొగ్గు చూపింది.
పూర్తి పేరు ఫ్రాంకోయిస్ డుప్లెసిస్. 1984 జూలై 13న పుట్టాడు. వయసు 37 ఏళ్లు. కుడి చేతి బ్యాటర్. 2011లో క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆసిస్ తో మొదటి టెస్టు 2012లో ఆడాడు.
చివరి టెస్టు 2021 ఫిబ్రవరిలో పాకిస్తాన్ తో ముగించాడు. 2011 జనవరిలో ఇండియాతో వన్డే మ్యాచ్ ప్రారంభించాడు. 2020లో టీ20 ఆరంగేట్రం చేశాడు.
2008 నుంచి 2009 దాకా లాంక్ షైర్ తరపున ఆడాడు. 2012 నుంచి 2015 దాకా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. 2018 నుంచి 2021 దాకా సీఎస్కే కు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read : సత్తా చాటి విండీస్‌ని ఓడించిన మిథాలీ సేన