DY CM Udhayanidhi : మల్లి కార్యకర్తలంతా ద్రావిడ పాలన కోసం కష్టపడాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
Udhayanidhi : రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి(Udhayanidhi) సూచించారు. కడలూరులో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఉదయనిధికి మంజకుప్పం ప్రాంతంలో డీఎంకే శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కడలూరులో కలైంజర్ శతజయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 12,100 మంది లబ్ధిదారులకు రూ.80 కోట్ల విలువైన సంక్షేమ సహాయాలను ఉదయనిధి అందజేశారు.
DY CM Udhayanidhi Stalin Comment
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే బుధవారం తన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటుచేయొద్దని, బాణాసంచా కాల్చరాదని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయాలు పంపిణీ చేయాలని, పాఠశాల విద్యార్థులకు పోటీలు ఏర్పాటుచేసి విజేతలకు బహుమతులు అందజేయాలని కోరారు.తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో మళ్లీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతిజ్ఞ చేయాలని, పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు సమన్వయంతో 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటినుంచే ప్రారంభించాలని ఉదయనిధి పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధపడుతున్నారు. బుధవారం నుంచి డిసెంబరు 27వ తేది వరకు జన్మించే శిశువులకు బంగారు ఉంగరం, తల్లులకు సంక్షేమ సహాయాలు అందజేయనున్నట్లు పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కాశిముత్తుమాణిక్యం, మంత్రి కోవై చెళియన్ ఓ ప్రకటనలో కోరారు.
Also Read : TN Minister Gandhi : పొంగల్ బహుమతిగా రేషన్ తో పాటు చీర, ధోవతి పంపిణీ చేస్తాం