DY CM Udhayanidhi : తమిళనాడు లో ఆ పార్టీపై భగ్గుమన్న డిప్యూటీ సీఎం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ....
DY CM Udhayanidhi : అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు కిరాణా సరుకులతో కూడిన సంక్షేమ సహాయాలను ఉదయనిధి(DY CM Udhayanidhi) అందజేశారు.
DY CM Udhayanidhi Stalin Comment
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత పార్లమెంటుఎన్నికల్లో ఊహించని రీతిలో భారీవిజయాన్ని చూశామని, అలాంటి విజయం మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సాధించేలా డీఎంకే శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. 234 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఏడోసారి కూడా డీంఎకేను అధికారంలో కూర్చోబెట్టాలని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ద్రావిడ మోడల్ అంటే ఏమిటని అడుగుతున్నారని, అందరికి సమానంగా ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యమన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా కలైంజర్ స్మారక మందిరంలో విధుల్లో పాల్గొంటున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు మొత్తం 1,335 మందికి సంక్షేమ సహాయాలు అందజేసినట్లు తెలిపారు. కూటమిలో చేరుతున్నవారు రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఆ పార్టీ క్షేత్రస్థాయి సమావేశంలో బహిరంగంగా ఆరోపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడేలా అన్నాడీఎంకే తరఫున అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సమావేశాలు అలజడులకు దారితీసేలా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సూచనల మేరకు డీఎంకే ఇప్పటికే ఎన్నికల పనులు ప్రారంభించిందన్నారు.
Also Read : Minister Ashwini Vaishnaw : రైల్వే సదుపాయాలపై మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అంశాలు వెల్లడి