DY Speaker RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఆర్ఆర్ఆర్
నా గుండెలపై కూర్చొని నన్ను కొట్టిన వ్యక్తిని నేను గుర్తించాను....
RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించడానికి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. అయితే నిందితుడిని గుర్తించడం కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఇవాళ(ఆదివారం) పోలీసులు పరేడ్ నిర్వహించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్‌లో ఉన్న తులసిబాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో రఘురామ(RRR)కు పరేడ్ నిర్వహించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐడీ ఏఎస్సీ విజయ్‌పాల్ అరెస్టై గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. పరేడ్ ముగిసిన అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు.
RRR Comment
‘‘నా స్టేట్‌మెంట్‌ను జిల్లా న్యాయమూర్తి రికార్డు చేశారు. నా గుండెలపై కూర్చొని నన్ను కొట్టిన వ్యక్తిని నేను గుర్తించాను. మొత్తం ఏడుగురుని చూపించారు. నా గుండెలపై కూర్చొనప్పుడు పెట్టుకున్న మాస్క్ జారీ పోయింది. నాపై కూర్చొని ఫోన్ ఓపెన్ చేయాలని కూడా అడిగాడు. నాపై దాడికి మొత్తం ఐదు మంది వచ్చినట్లు గుర్తించాను. గుడివాడలో టీడీపీని తులసీ బాబే బతికించాడని ప్రచారం చేసుకుంటున్నారు. నేనైతే టీడీపీ అధిష్టానానికి తులసీ బాబుపై ఫిర్యాదు చేయలేదు. తులసీ బాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసింది.
ఇక నుంచి తులసీ బాబును పక్కన పెడతారని అనుకుంటున్నాను. నాపై దాడి కేసులో A1, A2, A3లు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదు. నిబంధనల ప్రకారం కేసు నమోదు కాగానే ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. డాక్టర్ ప్రభావతి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. నా కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కుడా విచారించాలి. నన్ను అదుపులోకి తీసుకోక ముందే డాక్టర్ టీం రెడీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వివేక్ యాదవ్ పాత్ర ఏంటో కూడా తేల్చాలి’’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.
Also Read : President Murmu : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు