RBI E-Rupee : త్వరలో ఇ-రూపాయి లాంచ్ – ఆర్బీఐ
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం
RBI E-Rupee : రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రకటన చేసింది. ఇ-రూపాయిని(RBI E-Rupee) లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ – రూపాయి భారత దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. త్వరలో పైలట్ పథకంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ద్రవ్య విధానానికి అనుగుణంగా సెంట్రల్ బ్యాంకులు జారీ చేసే ఆమోదిత కరెన్సీ అని ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్య , చెల్లింపు వ్యవస్థలను మరింత సమర్థవంతంగా చేస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డిజిటల్ కరెన్సీపై కాన్సెప్ట్ నోట్ ను విడుదల చేసింది.
త్వరలో పైలట్ కింద ఇ-రూపాయిని(RBI E-Rupee) ప్రారంభిస్తామని పేర్కొంది. డిజిటల్ కరెన్సీ, డిజిటల్ రూపాయికి సంబంధించి అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆర్బీఐ కుండ బద్దలు కొట్టింది. డిజిటల్ కరెన్సీని తప్పనిసరిగా చెల్లింపు మాధ్యమంగా , చట్టబద్దమైన టెండర్ గా , పౌరులు, సంస్‌థలు, ప్రభుత్వ ఏజెన్సీలు విలువైన సురక్షితమైన స్టోర్ గా అంగీకరించాల్సి ఉంటుంది.
ఇది ఉచితంగా మార్చబడుతుంది. హోల్డర్లకు బ్యాంకు ఖాతా అవసరం లేదు. డబ్బు, లావాదేవీల జారీ ఖర్చును తగ్గిస్తుంది. కాగితపు కరెన్సీ వినియోగం తగ్గి పోవడంతో ప్రస్తుతం మరింత ఆమోద యోగ్యమైన ఎలక్ట్రానిక్ రూపమైన కరెన్సీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. యాక్సెస్ కంట్రోల్ ప్రోటోకాల్ లు, క్రిస్టోగ్రఫీని కలిగి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
డిజిటల్ కరెన్సీ నిజ సమయంలో భారీ డేటా సెట్ లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తోంది ఆర్బీఐ. ఆర్థిక స్థిరత్వానికి ఇది దోహదం చేస్తుందని నమ్ముతోంది.
Also Read : కనిష్ట స్థాయికి చేరిన రూపాయి