Eatala Rajender : గజ్వేల్ – సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నియోజకవర్గంలోని ములుగు మండల పరిధిలోని కమలాబాద్ గ్రామంలో క్యాంపెయిన్ చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Eatala Rajender Comments on KCR
నా కోళ్ల ఫారాలు ఈ ఊరు చుట్టూ ఉన్నాయని , నా ఎదుగుదలలో ఈ ఊరులో ఉన్న ప్రతి కుటుంబం ఉందన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడినని, తనను దీవించాలని కోరారు ఈటల రాజేందర్(Eatala Rajender). సీఎం కేసీఆర్ కేవలం మాటలు చెప్పిండని , ఒక్క పని చేయలేదని ఆరోపించారు.
తాను వచ్చాక కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. అందుకే ఇక్కడ ఓడి పోతానని కామారెడ్డికి పారి పోయిండంటూ ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తాను గెలవడం పక్కా అని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రజలను ఇన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురి చేయడం తప్ప చేసిన ఒక్క మంచి పని లేదని మండిపడ్డారు. ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాల్సిన సీఎం ఫామ్ హౌస్ కే పరిమితమై పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : KTR Slams : రాహుల్ కు కేటీఆర్ సవాల్
