Rahul Gandhi-EC : రాహుల్ ఆరోపణలపై లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న ఈసీ

పలు అవకతకవలు జరిగినట్టు కనుగొన్నామని చెప్పారు...

Rahul Gandhi : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను తాము గౌరవిస్తామని, దేశవ్యాప్తంగా ఒకేలా తామూ అనుసరించిన విధానపరమైన అంశాలతో త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని తెలిపింది.

Rahul Gandhi-Election Commission

మహారాష్ట్రఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ శుక్రవారంనాడు మీడియా సమావేశంలో ఆరోపించారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ మాట్లాడుతూ, విపక్ష పార్టీలన్నీ కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో పోరాడాయని, ఈ ఎన్నికలకు సంబంధించి కొంత సమాచారం మీడియా దృష్టికి తెస్తు్న్నామని అన్నారు.ఓటర్లు, ఓటర్ల జాబితాను తాము సమగ్రమంగా అధ్యయనం చేశాయమని, పలు అవకతకవలు జరిగినట్టు కనుగొన్నామని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకు శాసనసభ ఎన్నికలు జరిగాయని, ఈ 5 నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదుకాగా, కేవలం ఐదు నెలల్లో 39 లక్షల మంది ఓటర్లు నమోదు కావడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అకస్మాత్తుగా కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు. తాము పదేపదే ఈసీ(EC)కి విజ్ఞప్తులు చేసినా పట్టింకోలేదన్నారు.

మహారాష్ట్రలోజరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరినట్టు రాహుల్ చెప్పారు. తద్వారా కొత్తగా చేసిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా అర్థమవుతుందన్నారు. ఎంత మందిన ఒక బూత్‌ నుంచి మరో బూత్‌కు ఎందుకు బదిలీ చేశారో, ఎంతమది ఓటర్లను తొలగించారనే తెలుస్తుందని చెప్పారు. ముఖ్యంగా దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన చాలా మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, వేరే బూత్‌లకు బదిలీ చేయడం చేశారని రాహుల్ ఆరోపించారు. తాము పదేపదే దీనిపై ఈసీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఏదో తప్పిదం జరగడమే ఈసీ స్పందించకపోవడానికి ఏకైక కారణమని ఆరోపించారు. తాను ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, స్పష్టంగా గణాంకాలు మీడియా ముందుంచుతున్నానని అన్నారు.

Also Read : CM Chandrababu-DSC 2025 : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!