EC Notices: మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

EC Notices: టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల(EC) ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. మంత్రి జోగి రమేశ్‌, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగి రమేశ్‌ మాట్లాడుతూ… చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ ను కూడా ఫిర్యాదు కాపీకి జత చేశారు. వీడియో ఆధారంగా జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

EC Notices to..

మరోవైపు వాలంటీర్ల సేవల నిలిపివేతకు కారణమయ్యారంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో చేసిన పోస్టుపై ఈనెల 1న వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబుపై చేసిన పోస్టు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ధ్రువీకరించిన ఈసీ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన 48 గంటల్లో ఇరువురు నేతలు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది.

Also Read : Uppal Stadium: ఉప్పల్ స్టేడియానికి కరెంట్‌ కట్‌ !

Leave A Reply

Your Email Id will not be published!