EC Suspends Collector: అన్నమయ్య జిల్లా కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు ! ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ !
అన్నమయ్య జిల్లా కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు ! ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ !
EC Suspends Collector: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన గిరీషాపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎలక్షన్ కమీషన్(EC) ఆదేశాల మేరకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ విజయవాడను వదిలి వెళ్లొద్దని గిరీషాను, సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అయితే ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంతో మరి కొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరో ఐఏఎస్, ఐపీఎస్ మీద కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఐఏఎస్ సస్పెన్షన్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
EC Suspends Collector for
ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి కార్పోరేషన్ కమీషనర్ గా పనిచేస్తున్న గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ ను కొంతమంది అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేసి సుమారు 30 వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్ లోడ్ చేసారని ఆరోపిస్తూ బిజేపి నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్ లోడ్ పై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు… అప్పటి ఆర్వో, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అయినట్లు నిర్దారించారు. వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది. దీనితో అన్నమయ్య కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ… సీఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు.
Also Read : Statue of Social Justice: అంబేద్కర్ మహా శిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ !