Statue of Social Justice: అంబేద్కర్ మహా శిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ !

అంబేద్కర్ మహా శిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ !

Statue of Social Justice: విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో నిర్మించిన ఈ విగ్రహా ఆవిష్కరణకు… రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత చేసిన సామాజిక న్యాయం గురించి వివరించారు.

Statue of Social Justice in Amaravathi

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… “ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్య వాడగా కనిపిస్తోంది. ఇది న్యాయ మహా శిల్పం… ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు… మాములుగా మనం అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టి గురించి మాట్లాడేవారం. కాని ఈ స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ ఆవిష్కరించిన తరువాత ఇండియాలోనే విజయవాడ పేరు మారుమ్రోగుతుంది. దేశంలో పెత్తందారి, అంటరానితనంపై, కుల వివక్షపై, దుర్మార్గులపై, అక్కచెల్లెమ్మలపై వివక్షలపై పోరాటాలకు ఈ మహామనిషి స్ఫూర్తినిస్తుంటారు” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

విజ‌య‌వాడ న‌డిబొడ్డున ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్(Ambedkhar) భారీ విగ్రహం ప్ర‌పంచంలోనే అతిపెద్ద విగ్ర‌హ‌మ‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింద‌న్నారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని… ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుందని సీఎం జగన్ మండిపడ్డారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టికోకపోవడం అంటరానితనమేనని, పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని, పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమేనని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదని. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదని. అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చద‌ని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

“మనందరి ప్రభుత్వం ఈ విగ్రహాన్ని 56 నెలల్లో అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 206 అడుగుల విగ్రహం నిర్మించింది. అంబేద్కర్‌(Ambedkhar) జన్మించిన 133 సంవత్సరాల తరువాత, ఆయన మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ కింద ఈ రోజు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నామంటే కారణం..ఈ విగ్రహం వేల సంవత్సరాల దేశ సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త. మరణం లేని ఓ నేత విగ్రహం ఈ రోజు విజయవాడలో ఆవిష్కతమవుతుంది.

విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 75వ రిపబ్లిక్‌ డేకు వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేద్కర్‌(Ambedkha) మహా శిల్పం. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, సమానహక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిస్తుంది. అంబేద్కర్‌ అంటారాని తనంపై, అధిపత్యంపై తిరుగుబాటకు భావజాలంగా ఈ విగ్రహం కనిపిస్తుంది. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటారు. రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కాపాడే మహా శక్తిగా ఆయన కనిపిస్తుంటారు. తమ గొంతు వినిపించలేని అట్టడుగున వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని, చరిత్రగతినిమార్చిన కారకులు అంబేద్కర్‌. ఈ రోజు దళితజాతి నిలబడిందన్నా కూడా, రిజర్వేషన్లు కల్పించి వారిని ఒక తాటిపై నిలిపింది ఒక్క అంబేద్కర్‌స్ఫూర్తినే.” అని సీఎం పేర్కొన్నారు.

“కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతీ గ్రామంలో అంబేద్కర్ ఆశయాలైన విద్యా విప్లవం, మహిళా సాధికారత, స్థానిక స్వపరిపాలనలో విప్లవాత్మమైన పరిపాలన విధానాలు, వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనతో ఈ రోజు ప్రతి జిల్లా అభివృద్ది పథంలో దూసుకుపోతోంది,” అని సీఎం జగన్ స్పష్టం చేసారు.

Also Read : One Nation One Elections: ‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం- కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Leave A Reply

Your Email Id will not be published!