EC : లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈసీ ఈ మేరకు బదిలీలు చేపట్టింది
EC : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం(EC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోమ్ కార్యదర్సులు, బెంగాల్ పోలీసు చీఫ్ లపై వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోమ్ శాఖ కార్యదర్సులను తొలగిస్తూ ఈసీ ఆదేశించింది. మిజోరాం, హిమాచల్ ప్రదేశ్‌ల ప్రధాన న్యాయాధికారులను కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ పోలీస్ (డీజీపీ) చీఫ్‌ను తొలగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టిందని ఈసీ అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈసీ ఈ మేరకు బదిలీలు చేపట్టింది. ఎన్నికల ముందు ఇలాంటి మార్పులు మామూలే.
EC Comment
మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న మూడో సంవత్సరం అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : PM Modi : ఈ నెల 21వ తేదీ నుండి 22 వరకు భూటాన్లో పర్యటించనున్న ప్రధాని మోదీ