ED Attaches : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఆస్తులు జ‌ప్తు

బ్యాంకుల ఖాతాలు క్లోజ్

ED Attaches : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో రోజు రోజుకు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి అప్రూవ‌ర్ గా మారిన వ్యాపార‌వేత్త దినేష్ అరోరాను అదుపులోకి తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ED). ఇదే కేసులో కీల‌క నిందితుడిగా, నెంబ‌ర్ వ‌న్ విక్టిమ్ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయ‌కుడు, మాజీ డిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది.

ఇప్ప‌టికే ఆయ‌న తీహార్ జైలులో ఉన్నారు. త‌న‌ను కావాల‌ని కేంద్రం ఒత్తిళ్ల మేర‌కు లిక్క‌ర్ పాల‌సీ కేసులో ఇరికించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సిసోడియా. మ‌ద్యం పాల‌సీ అమ‌లుకు సంబంధించి ఫైలుపై సంత‌కం చేసిన ఆనాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా నిందితుడేనంటూ పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం.

త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని, అరెస్ట్ చేయ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు మ‌నీష్ సిసోడియా. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టులో తీవ్ర వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయి. రూ.100 కోట్లు చేతులు మారాయని ఆరోపించింది ఈడీ.

తాజాగా మ‌ద్యం స్కాం కేసులో సిసోడియా, అమ‌న్ దీప్ సింగ్ ధాల్ , రాజేష్ జోషి, గౌత‌మ్ మ‌ల్హోత్రా , త‌దిత‌రుల ఆస్తుల‌తో స‌హా రూ. 52 కోట్ల విలువైన ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది. వీరితో పాటు రూ. 11 ల‌క్ష‌ల‌తో సిసోడియా, భార్యకు చెందిన బ్యాంకు ఖాతాల‌ను స్తంభింప చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌.

Also Read : Botsa Satyanarayana : ముంద‌స్తు ముచ్చ‌ట అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!