ED Raids Byju : బైజు సిఇఓ ర‌వీంద్ర‌న్ ఇంట్లో సోదాలు

ప్ర‌పంచంలో 2071వ ధ‌న‌వంతుడు

ED Raids Byju : బైజు సంస్థ సీఇవో ర‌వీంద్ర‌న్ కు షాక్ త‌గిలింది. శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ(ED Raids Byju) ఆయ‌న ఇంట్లో సోదాలు చేప‌ట్టింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ త‌ర్వాత బైజు ర‌వీంద్ర‌న్ 2019లో బిలియ‌నీర్ గా మారాడు. 150 మిలియ‌న్ డాల‌ర్ల నిధులు పొందింది బైజు. ఇందుకు సంబంధించి సోదాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

ఇక బైజు ర‌వీంద్ర‌న్ 2011లో త‌న భార్య దివ్య గోకుల్ నాథ్ తో క‌లిసి బైజుని స్థాపించారు. అంత‌కు ముందు ఆయ‌న గ‌ణిత శాస్త్రంలో బోధ‌కుడిగా ఉన్నారు. టీచ‌ర్ల కుటుంబానికి చెందిన వ్య‌క్తి. బైజు ర‌వీంద్ర‌న్ స్వ‌స్థ‌లం కేర‌ళ‌. కే-12 ఎడ్యుకేష‌న్ మార్కెట్ పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. విద్యా ప‌ర‌మైన కంటెంట్ ను ఉత్ప‌త్తి చేయ‌డ‌మే బైజు ల‌క్ష్యం.

బైజుని థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ గా స్థాపించారు ర‌వీంద్ర‌న్. ఇది లెర్నింగ్ యాప్. 2015లో దీనిని స్థాపించాడ. ఒక ఏడాది త‌ర్వాత జుక‌ర్ బ‌ర్గ్ ఇనిషియేటివ్ నుండి పెట్టుబ‌డిని పొందిన మొద‌టి ఆసియా కంపెనీగా బైజు పేరు పొందింది.

ఫోర్బ్స్ ప్ర‌కారం బైజు ర‌వీంద్ర‌న్ ప్ర‌స్తుత నిక‌ర విలువ $1.4 మిలియ‌న్లు. ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతుల‌లో మ‌నోడు 2071వ స్థానంలో ఉన్నాడు. బెంగ‌ళూరుతో పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో ఈడీ సోదాలు చేప‌ట్టింది.

Also Read : వాళ్లు అభివృద్ది నిరోధకులు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!