ED Raids : వినోద్..మాజీ క్రికెట‌ర్ల‌కు షాక్

హైద‌రాబాద్ లో ఈడీ సోదాలు

ED Raids : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న‌ట్టుండి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దాడులకు శ్రీ‌కారం చుట్టాయి. ప్ర‌త్యేకించి బీఆర్ఎస్ , బీజేపీ నేత‌లు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి మాజీ క్రికెట‌ర్ల ఇళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బుధ‌వారం ఆదాయ ప‌న్ను శాఖ మూకుమ్మ‌డి దాడికి పాల్ప‌డింది.

ED Raids on Farmer Crickter

గ‌తంలో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ చీఫ్ , గ‌డ్డం వివేక్ సోద‌రుడు , బెల్లంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గ‌డ్డం వినోద్ కుమార్ నివాసంలో ఈడీ సోదాలు చేప‌ట్టింది. వినోద్(Vinod) తో పాటు గ‌తంలో భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడిన శివ లాల్ యాద‌వ్ , అర్ష‌ద్ అయూబ్ కు చెందిన నివాసం, ఆఫీసుల్లో కూడా సోదాలు చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో వీరిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి ఉప్ప‌ల్ స్టేడియం నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన విష‌యం విదిత‌మే.

అంత‌కు ముందు మ‌రో షాక్ త‌గిలింది వినోద్ కుమార్ సోద‌రుడు వివేక్ వెంక‌ట‌స్వామి ఇళ్ల‌ల్లో ఏక కాలంలో ప‌లు బృందాలు దాడుల‌కు దిగాయి. వి6 ఛాన‌ల్ తో పాటు విశాఖ ఇండ‌స్ట్రీస్ కు చైర్మ‌న్ గా ఉన్నారు వివేక్. త‌ను ప్ర‌స్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు. ఈయ‌న ప‌లు పార్టీలు మారారు. చివ‌ర‌కు స్వంత గూటికి చేరుకున్నారు.

Also Read : CM KCR : రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్

Leave A Reply

Your Email Id will not be published!