Election Commission: రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసిన సీఈసీ

రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసిన సీఈసీ

Election Commission : వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సీఈసీ(Election Commission) నోటిఫికేషన్ ఇచ్చింది.

Election Commission – రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇదే

ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ

ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన

మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో… ఆ పార్టీకు చెందిన కీలక నేతలు తమ పదవులకే కాకుండా… పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి… పార్టీ ప్రాధమిక సభ్యత్వం, పదవులతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. అంతేకాదు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే చేస్తున్నానని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానంటూ ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతని రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Also Read : Ex MP Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!