Elon Musk Shock : మస్క్ జబర్దస్త్ జర్నలిస్టులకు షాక్
తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని
Elon Musk Shock : సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్న ట్విట్టర్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk). తనకు ప్రత్యర్థి అయిన మాస్టోడాన్ ను కవర్ చేసే జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసింది మైక్రో బ్లాగింగ్ సంస్థ.
ఖాతాలపై వేటుకు గురైన జర్నలిస్టులంతా ఇటీవలి నెలల్లో ట్విట్టర్ చీఫ్ , బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ప్లాట్ ఫారమ్ లలో చోటు చేసుకున్న మార్పుల గురించి పెద్ద ఎత్తున రాశారు. ప్రత్యేక కథనాలలో వెల్లడించారు. అంతే కాదు ఎలాన్ మస్క్ ట్విట్టర్ సోషల్ మీడియా సైట్ మాస్టోడాన్ ఫీడ్ ను కూడా సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం మాస్టోడాన్ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ , వాషింగ్టన్ పోస్ట్ లతో సహా పలువురు జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది. దీనిని ధ్రువీకరించింది కూడా. అంతే కాదు వారి ఖాతాలకు సంబంధించి నోటీసులను కూడా చూపుతోంది.
ఆ ఖాతాలను ఎందుకు సస్పెండ్ చేశారో రాయిటర్స్ ఇంకా నిర్ధారించ లేదు. అయితే ఖాతా సస్పెన్షన్లపై చేసిన ట్వీట్ కు ప్రతిస్పందించారు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk). ట్విట్టర్ ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపదు. ఇదే సమయంలో తమ సంస్థకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఫాలో కాని వారి పట్ల చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Also Read : 50 నగరాల్లో 5జీ పరుగులు