Elon Musk : ప్రతిభ సరే తొలగింపు మాటేంటి
వారానికి 40 గంటలు పని చేయాల్సిందే
Elon Musk : ప్రపంచంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైర్మన్ , సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తాజాగా తమ సిబ్బందికి జారీ చేసిన మెయిల్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
టెస్లాలో ప్రపంచ వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా వివిధ స్థాయిలలో పని చేస్తున్నారు. ఎంతో మంది అనుభవం కలిగిన వారున్నారు. ఎప్పుడైతే ఎలోన్ మస్క్ ట్విట్టర్ పై కన్నేశాడో ఆయనకు అంతా వ్యతిరేకత ఎదురవుతోంది.
టెస్లా షేర్ల ధరలు ఊహించని రీతిలో పడి పోయాయి. ఎలోన్ మస్క్(Elon Musk) ప్రపంచంలో టాప్ ధనవంతుడిగా ఉన్నారు మొన్నటి వరకు. తాజాగా 9 శాతం షేర్స్ వాల్యూ పడిపోవడంతో ఆయన స్థానానికి ఢోకా ఏర్పడింది.
తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. టెస్లాలో పని చేస్తున్న 10 మందిలో ఒకరిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు పనిచేస్తున్న వారిలో అభద్రతా భావాన్ని కలుగ చేస్తోంది.
కాగా ఎవరు ఉన్నా లేక పోయినా టాలెంట్ కలిగిన వారికి టెస్లాలో తప్పక అవకాశం ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రత్యేక కథనం రాసింది.
టెస్లాలో టాలెంట్ సరే తొలగింపు కలకలం మాటేంటి అన్న ప్రత్యేక కథనం చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో తన అంతర్గత ఈమెయిల్ లో అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి సూపర్ బ్యాడ్ ఫీలింగ్ గా వర్ణించాడు.
కాగా పని చేసే వారు వారంలో 40 గంటలు తప్పక పని చేయాల్సిందేనని లేక పోతే తొలగిస్తామంటూ హెచ్చరించారు మస్క్.
Also Read : గూగుల్ ఆపిల్ నువ్వా నేనా