Elon Musk : ఉండేందుకు స్వంత గూడు లేదు

టెస్లా సిఇఓ ఎలోన్ మ‌స్క్ వెల్ల‌డి

Elon Musk : ఆయ‌న ప్ర‌పంచంలోనే టాప్ వ‌న్ కుబేరుడు. చిటికేస్తే కోట్లు. ప్ర‌తి రోజూ కోట్లాది రూపాయ‌ల‌తో బిజినెస్ చేస్తాడు. క‌ళ్లు చెదిరే కార్ల కంపెనీకి ఓనర్. ప్ర‌స్తుతం నెట్టింట్లో షేక్ చేస్తున్న ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయాల‌ని చూస్తున్నాడు.

ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా తాను వెళ్ల‌గ‌ల‌డు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న వ‌ద్ద ఉన్న ధ‌నంతో ప‌లు దేశాల‌ను ఏల‌గ‌ల‌డు. ఇంత‌టి ధ‌న‌వంతుడైన బిలియ‌నీర్ అయిన ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఆయ‌న చెప్పింది ఏమిటంటే త‌న‌కు ఉండేందుకు స్వంత గూడు లేద‌ని. ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఇప్ప‌టి వ‌ర‌కు స్నేహితుల ఇళ్లలోనే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఎలోన్ మ‌స్క్(Elon Musk).

ఫోర్బ్స్ ప్ర‌కారం టెస్లా సిఇఓ క‌మ్ చైర్మ‌న్ నిక‌ర విలువ $269.5 బిలియన్లుగా ఉంది. ట్విట్ట‌ర్ లో షేర్స్ కొనుగోలు చేయ‌డం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

టెడ్ కు చెందిన క్రిస్ అండ‌ర్స‌న్ తో మాట్లాడిన మ‌స్క్(Elon Musk) ఈ విష‌యాల‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుతం స్వంత స్థ‌లం లేద‌ని స్ప‌ష్టం చేశారు. స్నేహితుల ప్ర‌దేశాల‌లో నిద్రిస్తూ వ‌స్తున్నాన‌ని తెలిపారు మ‌స్క్.

నేను టెస్లా ఇంజ‌నీరింగ్ లో ఎక్కువ భాగం ఉన్న బే ఏరియాకు ప్ర‌యాణిస్తే నేను ప్రాథ‌మిక స్నేహితుల విడి బెడ్ రూమ్ ల ద్వారా తిరుగుతానని చెప్పారు ఎలోన్ మ‌స్క్.

తాను సిఇఓగా ఇప్ప‌టి వ‌ర‌కు సెల‌వులు తీసుకోలేద‌ని తెలిపారు. స్వంతానికి ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌న‌ని పేర్కొన్నారు.

Also Read : రూ. 757.77 కోట్ల ఆమ్వే ఆస్తులు అటాచ్

Leave A Reply

Your Email Id will not be published!